- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐడియల్ బామ్మ.. 80 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ
దిశ, ఫీచర్స్ : చదువుకు వయసు అడ్డంకి కాదని, జిజ్ఞాస ఉంటే చాలు ఏ వయసులోనైనా చదువుకోవచ్చని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ నగరానికి చెందిన శశికళ రావల్ నిరూపించారు. 80 ఏళ్ల వయసులో సంస్కృతంలో పీహెచ్‌డీ పట్టా అందుకుని స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. విక్రమ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన స్నాతకోత్సవంలో మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమెకు డాక్టరేట్ సర్టిఫికెట్ప్రదానం చేశారు. చదువుకు వయసుతో సంబంధం లేదని రుజువు చేసిన శశికళను ఈ సందర్భంగా అభినందించిన గవర్నర్.. తనను చూసి విద్యార్థులు ప్రేరణ పొందాలని కోరారు.
పీహెచ్‌డీ చేయాలనేది శశికళ కల కాగా, లెక్చరర్ ఉద్యోగం వల్ల ఆమెకు వీలు కాలేదు. లెక్చరర్‌గా రిటైర్ అయిన తర్వాత ఆమెకు టైమ్ దొరకడంతో పీహెచ్‌డీ చేయాలని నిర్ణయించుకుంది. ‘మహారిషి పనిని’ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ మిథిలా ప్రసాద్ త్రిపాఠి గైడెన్స్‌లో ‘బృహిత సంహిత’పై రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేసి డాక్టరేట్ పొందింది. రిటైర్మెంట్ తర్వాత చాలా మంది రెస్ట్ తీసుకుంటుండగా.. తన కలను సాకారం చేసుకునేందుకు తిరిగి పుస్తకాలు పట్టిన శశికళ, పీహెచ్‌డీ కంప్లీట్ చేయడం విశేషం.