తెలంగాణలో ఎనిమిది హాట్‌స్పాట్ జిల్లాలు

by vinod kumar |
తెలంగాణలో ఎనిమిది హాట్‌స్పాట్ జిల్లాలు
X

దిశ, ఆదిలాబాద్: కరోనా ప్రభావం ఎక్కువగా ఉండి, వైరస్ విస్తరించే అవకాశం ఉన్న హాట్‌స్పాట్ జిల్లాలు రాష్ట్రంలో ఎనిమిది ఉన్నట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ అర్బన్, నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాలు ఉన్నాయి. హాట్‌స్పాట్ జిల్లాల్లో కరోనా కట్టడి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. కేంద్రం గుర్తించిన ఈ జిల్లాల్లో కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి ప్రత్యేక బృందాలు పనిచేయనున్నాయి. ఇన్‌ఫ్లూయెంజాతోపాటు ఎస్ఏఆర్ఐ లక్షణాలు ఉన్నవారిని కూడా గుర్తించనున్నారు. హాట్‌స్పాట్ జిల్లాల్లో వచ్చే 28 రోజులపాటు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కరోనా వైరస్ బాధితులు పూర్తిగా కోలుకుని, కొత్త కేసులు నమోదు కానంత వరకు ఆంక్షలు కొనసాగుతాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ తెలిపింది.

Tags: 8 districts, corona virus, hotspots, telangana says centre

Advertisement

Next Story

Most Viewed