- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి నిజామాబాద్‌లో 8 పాజిటివ్
దిశ, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 8 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండు, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 4, పెద్ద కోడప్‌గల్ 2 పాజిటివ్ కేసులు నిర్దారణ అయిన్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో బిచ్కుందకు చెందిన వ్యాపారి మహరాష్ట్రకు వెళ్లి వచ్చిన తరువాత పాజిటివ్ అని తెలింది. అనంతరం అతనితో ప్రాథమికంగా కాంటాక్ట్‌లో ఉన్న నలుగురికి పాజిటివ్ వచ్చింది. బిచ్కుంద, పెద్ద కోడప్‌గల్‌లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. దీంతో వారిని ఎవరెవరిని కలిశారో అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 134 పాజటివ్ కేసులు కాగా, అందులో 38 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 73 పాజిటివ్ కేసులు ఇప్పటివరకూ నమోదు అయ్యాయి. జిల్లాలో 50 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు.