భారీ వర్షాలకు ఏడుగురు మృతి

by Shamantha N |
భారీ వర్షాలకు ఏడుగురు మృతి
X

చెన్నై: బురేవి తుఫాన్ ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏడుగురు మృతిచెందారు. వందల గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కడలూరు జిల్లాలోనే 300 గ్రామాలు వరదల ప్రభావానికి గురయ్యాయి. రామాంతపురం జిల్లా రామేశ్వరంలోని చాలా ప్రాంతాలు అంధకారంలో చిక్కుకుపోయాయి. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎడపాడు పళనిస్వామి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ధ్వంసమైన ఇళ్లకు, మృత్యువాత పడిన పాడిపశువులకు కూడా పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 ఇండ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 1725 పాక్షికంగా దెబ్బతిన్నాయి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నామని, వాటిని పరిశీలించడానికి మంత్రులు వెళ్లారని సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. కడలూరు జిల్లాలో 66వేలు, రామాంతపురం జిల్లాలో 6వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అందరికీ అల్పహారం అందించామని, ఏకధాటిగా వర్షం పడుతుండటంతో సమస్య ఎదురవుతున్నదని సీనియర్ ఐఏఎస్ అధికారి గగన్‌దీప్ సింగ్ బేడి తెలిపారు. వీరనం చెరువు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed