తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే?

by vinod kumar |   ( Updated:2021-04-30 23:39:25.0  )
తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్తగా 7,754 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక నిన్న కరోనాతో 51 మంది మృతి చెందారని దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,312 చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 4,43,360 కరోనా కేసులు ఉన్నాయి. ఇక కరోనాతో తాజాగా 6,542 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 3,62,160 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక జీహెచ్ ఎంసీలో కొత్తగా 1507 నమోదయ్యాయి.

Advertisement

Next Story