కేంద్రంపై ఆగ్రహం.. రోడ్డెక్కిన సింగరేణి కార్మికులు

by Aamani |
Singareni Workers strike
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరాంపూర్, మందమర్రి, రామకృష్ణపుర్, బెల్లంపల్లిలోని బొగ్గు బావుల ప్రైవేటీకరణకు నిరసిస్తూ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు అమ్మేస్తోందని, ఇప్పుడు కేంద్రం కన్ను బొగ్గుపరిశ్రమపై పడిందని కార్మికులు వాపోయారు. కోల్ ఇండియాలో 168 బొగ్గు బ్లాకులను తమ గుజరాత్ మిత్రులకు అమ్మడానికి మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. సింగరేణికి చెందిన కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణపల్లి, కేకే. ఆరు గనులతో పాటు దేశవ్యాప్తంగా 88 గనులను కార్పొరేట్లకు అప్పగించేందుకు డిసెంబర్ 11న ముహూర్తం పెట్టినట్లు తెలిసింది. దీంతో కార్మిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం తెచ్చిన బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 9,10,11లలో (72 గంటలపాటు) సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు కార్మిక సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేస్తున్నది.

Singareni Workers strike

తెలంగాణ అసెంబ్లీలో బొగ్గు బావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మాణం చేసి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సింగరేణి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమను కాపాడుకునేందుకు విశాల ప్రజా పోరాటంగా మార్చాలని, నిరవధిక సమ్మెతోనే మోడీ ప్రభుత్వం మెడలువంచి బావులను కాపాడుకోవాలన్నారు. ఇందుకు ఇటీవల రైతులు సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మికవర్గం ఉద్యమానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బొగ్గుబావుల రక్షణ కోసం 2000 సంవత్సరంలో 17 రోజులపాటు నిరవధిక సమ్మె చేసిన చరిత్ర సింగరేణి గనికార్మికులకు ఉందిని గుర్తుచేశారు. ఎన్నికల దృష్టిని వదిలి నిజాయితీగా బొగ్గుగనుల రక్షణ కోసం ఐక్యం ఐక్యపోరాటాలకు ప్రధాన కార్మిక సంఘాలు పూనుకోవాలి తెలిపారు. 72 గంటలపాటు బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేసి, ప్రభుత్వాన్ని హెచ్చరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐతు జాతీయ సంఘాల నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed