- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వేలానికి సిద్దంగా 706 వాహనాలు : సీపీ మహేష్ భగవత్
దిశ, క్రైమ్ బ్యూరో : వాహనాలు వేలానికి సిద్దంగా ఉన్నాయి. చోరీ కేసులు, డ్రంకెన్ డ్రైవ్, వివిధ తనిఖీల సందర్భాలలో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల జాబితాను రాచకొండ పోలీసులు విడుదల చేశారు. ఈ జాబితాలో మీ వాహనం ఉన్నట్టయితే, సంబంధిత ఒరిజినల్ డాక్యుమెంట్లను చూపించి వాహనాలను తీసుకెళ్లాలని యాజమానులకు రాచకొండ పోలీసులు సూచించారు. లేదంటే, రెండు వారాల్లో ఈ వాహనాలను వేలం వేస్తామని సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు.
రెండేళ్లల్లో 706 వాహనాలు..
2018లో 1431, 2019లో 836 వాహనాలను పోలీసులు వేలం వేయగా, గతేడాది 2020 లో కరోనా కారణంగా వాహనాల వేలం వేయలేదు. ఈ క్రమంలో 2021 ఏడాదిలో తమ వద్దనున్న 706 వాహనాలను వేలం వేసేందుకు పోలీసులు సిద్దం అయ్యారు. దీంతో చివరిసారిగా పోలీసుల వద్ద ఉన్న వాహనాలకు సంబంధించి ఒరిజినల్ పత్రాలను చూపించి యాజమానులు అట్టి వాహనాలను తీసుకెళ్లాలని పోలీసులు చెబుతున్నారు. మల్కాజిగిరి జోన్ ఉప్పల్, ఘట్కేసర్, కుషాయిగూడ, కీసర, నేరేడ్మెంట్, నాచారం పోలీస్ స్టేషన్ల పరిధిలో 138, ఎల్‌బీనగర్ జోన్ ఎల్‌బీ నగర్, సరూర్ నగర్, మీర్‌పేట్, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, మంచాల, కందుకూరు, ఆదిభట్ల, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 328 వాహనాలు ఉన్నాయి. ఇవి కాకుండా, ట్రాఫిక్ విభాగం పరిధిలో కుషాయిగూడ, ఎల్‌బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి, వనస్థలిపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 240 వాహనాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 678 టూవీలర్లు ఉండగా, త్రీ వీలర్లు 14, ఫోర్ వీలర్లు 12, రెండు లారీలు ఉన్నాయి. ఈ వాహనాలను www.rachakondapolice.telangana.gov.in వెబ్ సైట్ లో సిటీజన్స్ సర్వీస్ అబాండెడ్ వెహికిల్స్ లిస్ట్ -2021 జాబితాలో చూసుకోవాలి.
15 రోజుల్లో సంప్రదించాలి..
ఈ వాహనాలను అంబర్ పేట సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో చెక్ చేసుకున్న పిదప.. ఆయా పోలీస్ స్టేషన్లలో ఒరిజినల్ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. యాజమానులు తమ వాహనాలను పొందడానికి 15 రోజుల్లో సంబంధిత పోలీసులను సంప్రదించాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. లేదంటే, 15 రోజుల అనంతరం ఈ వాహనాలను వేలం వేస్తామని ప్రకటించారు. మరిన్ని వివరాలకు అంబర్ పేట లోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ లోని అడిషనల్ డీసీపీ లేదా 83339 93539 నెంబరులో సంప్రదించాలన్నారు.