- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ ప్రకటన.. 700 కి.మీల ట్రాఫిక్ జామ్
by vinod kumar |
X
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించే ప్రటకన వెలువడగానే పట్టణాల్లోని ప్రజలు పల్లెలకు పోటెత్తారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభించడంతో మరోసారి లాక్‌డౌన్ విధించే నిర్ణయాన్ని అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్ తీసుకున్నారు. శుక్రవారం నుంచి సరిగ్గా నాలుగు వారాల పాటు(డిసెంబర్ 1 వరకు) దేశంలో లాక్‌డౌన్ అమలవుతుందని గురువారం ఆదేశించారు. దీంతో దేశరాజధాని ప్యారిస్ నుంచి ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు తరలివెళ్లడానికి పెద్దమొత్తంలో రోడ్లపైకి వచ్చారు. దీంతో ఒక్కసారిగా రవాణా స్తంభించింది. సుమారు 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అలాగే, ఎప్పుడూ రద్దీగా కనిపించే ప్యారిస్ నగర వీధులు శుక్ర, శనివారాల్లో వెలవలబోయాయి. ప్రభుత్వం కఠిన నిబంధనలతో తాజా లాక్‌డౌన్ విధించింది.
Advertisement
Next Story