- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేటీఎం, అమెజాన్ కేవైసీ పేరుతో ఘరానా మోసం
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కరోనా కష్టకాలంలో చాలామంది వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారు. బయటకు వెళితే ఎక్కడ వైరస్ బారిన పడుతామో అనే భయమే ఆన్ లైన్ సేల్స్ పెరగడానికి కూడా ఓ ప్రధాన కారణం.. ఈ విషయం గమనించిన కేటుగాళ్లు పకడ్భందీ ప్లాన్ వేశారు.
పేటీఎం, అమెజాన్ కంపెనీ కస్టమర్ కేర్ తరఫున కాల్ చేస్తున్నామని ఆయా కంపెనీల వినియోగదారులతో నమ్మబలికారు. మీ కేవైసీ అకౌంట్ అప్ డేట్ చేయాలని లేనియెడల కొనుగోళ్లు, పేమెంట్స్ ఆగిపోతాయని పలువురిని నమ్మించారు. ఈ క్రమంలోనే వారి బుట్టలో పడిన వ్యక్తుల నుంచి సుమారు రూ. 7.75లక్షలు కాజేశారు. డబ్బులు పొగొట్టుకున్న బాధితులు వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించారు. అసలు విషయం చెప్పి తమకు న్యాయం చేయాలని పోలీసులు ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు.
Advertisement
Next Story