అరవైలో.. ఆరుపలకల దేహం!

by Anukaran |   ( Updated:2020-12-05 10:49:54.0  )
అరవైలో.. ఆరుపలకల దేహం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు పదులు దాటాయంటే బాడీలో హెల్త్‌పరంగా వచ్చే మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఇక షష్టి పూర్తి వయసుకు చేరామంటే వృద్ధాప్యానికి స్వాగతం పలికినట్లే. కానీ కొందరు మాత్రం అరవైలోనూ యంగ్‌గా కనిపిస్తూ, అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. మరి ఆరు పదుల వయసులో ఆరు పలకల దేహాన్ని మెయింటైన్ చేయడం సాధ్యమా? అంటే సాధ్యమే అని నిరూపిస్తున్నాడు అమెరికాలోని కెంట్‌కు చెందిన 67 ఏళ్ల మైక్ మిల్లెన్. డెబ్భైకి చేరవవుతున్న టైమ్‌లోనూ ఉరకలేసే ఉత్సాహంతో, యువకులకు మార్గదర్శిగా నిలుస్తున్న మైక్.. వారికి ఫిట్‌నెస్ పాఠాలు చెబుతూ మెరికల్లా తయారు చేస్తున్నాడు. ఇంతకీ ఆ యంగ్ గ్రాండ్ పా ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏంటి?

మైక్ మిల్లెన్ 20 సంవత్సరాల నుంచి పర్సనల్ ట్రైనర్‌గా పనిచేస్తుండటంతో పాటు పార్ట్ టైమ్ మోడల్‌గానూ రాణిస్తున్నాడు. ప్రతిరోజు సముద్ర తీరాన, ప్రకృతి ఒడిలో వర్క్‌వుట్ చేసే మైక్.. ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా తన ప్రాక్టీస్‌ను మాత్రం కొనసాగిస్తాడు. రన్నింగ్, వాకింగ్‌తో పాటు బైసిప్స్, పుషప్స్ చేస్తాడు.

‘నేను జిమ్‌లో ట్రైనింగ్ ఇవ్వడం కంటే ప్రకృతిలో(బీచ్, ఫారెస్ట్, పార్క్ ) వర్క్‌వుట్స్ చేయించడానికి ఇష్టపడతాను. దానివల్ల మన శరీరమే కాకుండా మెదడు, హృదయం కూడా నూతనోత్తేజాన్ని పొందుతాయి. మనం సంకల్పించుకుంటే ఏదైనా చేయగలుగుతాం. ఐస్‌లాండ్‌లో -12 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో ట్రైనింగ్ ఇస్తున్న సమయంలోనూ ఐస్‌బర్గ్ మధ్యలో ఈతకొట్టినట్లు అనిపించింది. అయినా ట్రైనింగ్ కంటిన్యూ చేశాం. ఫిట్‌నెస్ పెంచుకోవాలన్నా, వర్క్‌వుట్స్ స్టార్ట్ చేయాలన్నా వయసు అనేది అసలు అడ్డంకే కాదు. కానీ మన శరీరం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో, అదే స్థాయిలో మన వర్క్‌వుట్స్ ఉండాలి. అవసరానికి మించి బరువులు ఎత్తకూడదు. కఠినతరమైన వ్యాయామాలు చేయకూడదు. వర్క్‌వుట్స్ చేయడం కుదరకపోతే, కనీసం ప్రతిరోజు తప్పకుండా వాకింగ్ చేయాలి. ఫిట్‌నెస్ కాపాడుకోవడమంటే మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవడమే. నేను వారంలో రెండు సార్లు ‘లైవ్ నవ్స్’ అనే వర్చువల్ ఫిట్‌నెస్ ప్లాట్‌ఫామ్ ద్వారా నా ఫిట్‌నెస్ సీక్రెట్స్, టిప్స్, లైఫ్ ఎక్సిపీరియెన్స్ షేర్ చేసుకుంటాను’ అని మైక్ పేర్కొన్నాడు. మైక్‌ను ఇన్‌స్టాలోనూ ఫాలో కావచ్చు.

మైక్ మిల్లెన్ ఒక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫిట్‌నెస్ విషయంలో వయసు అడ్డంకి కాదని నిరూపించారు. అందుకే వయసు మీద పడుతున్నా, హెల్తీగా ఉండాలంటే చిన్నపాటి వర్క్‌వుట్స్ చేస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

Advertisement

Next Story

Most Viewed