జర్నలిస్టుల ప్రాణాలకు ముప్పు.. 2020లో ఎంతమంది మరణించారంటే..!

by Shamantha N |   ( Updated:2021-03-12 12:13:59.0  )
జర్నలిస్టుల ప్రాణాలకు ముప్పు.. 2020లో ఎంతమంది మరణించారంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : సమాజహితం కోసం రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా నిత్యం శ్రమిస్తూ ఉండే జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకుంటోన్న చీకటి కోణాలను ఛేదించి ప్రజల ముందుంచడంలో జర్నలిస్టులు, మీడియా వ్యక్తుల శ్రమ ఎనలేనిది. అయితే, ప్రస్తుత రోజుల్లో విధినిర్వహణ కోసం కట్టుబడిన జర్నలిస్టుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. మృత్యువు ఎటునుంచి వస్తుందో తెలియక చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో ఉద్దేశపూర్వక దాడులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో నిజాయితీగా విధులు నిర్వహించే విలేకరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ బాధ్యతలను నేరవేర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు.

2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 65 మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా అసువులు బాశారు. ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్టుల రిపోర్టు’ ప్రకారం.. వరల్డ్ వైడ్‌గా 16 దేశాల్లో ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడులు, బాంబ్ బ్లాస్ట్స్, క్రాస్ ఫైర్ ఘటనల్లో 65 మంది జర్నలిస్టులు మరణించారు. 2020 రిపోర్టు ఆధారంగా మెక్సికో దేశంలో విధినిర్వహణలో 14 మంది జర్నలిస్టులు చనిపోగా, ఆఫ్ఘనిస్తాన్‌లో-9, పాకిస్తాన్- 9, ఇండియాలో-8 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికంగా జర్నలిస్టులు మరణించిన దేశాల్లో ప్రజాస్వామ్య దేశమైన ఇండియా నాలుగో స్థానంలో నిలవడం ఆందోళన కల్గించే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story