- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుది దశకు రైతుబంధు పంపిణీ సాయం
దిశ, తెలంగాణ బ్యూరో: రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ తుది దశకు చేరుతోంది. బుధవారం నాటికి 1.25కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం జమ చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 61.49లక్షల మంది రైతులకు 1.52కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందించనున్నారు. యాసంగి సీజన్లో రైతుబంధు కోసం రూ. 7,515 కోట్లు విడుదల చేశారు. దీనికోసం గత ఏడాది డిసెంబర్ 28నుంచి బ్యాంకుల్లో జమ చేయడం మొదలైంది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం బుధవారం నాటికి 57,26,418 మంది రైతులకు 125.45 లక్షల ఎకరాలకు రైతుబంధు సొమ్మును పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 6272,55,26,506 లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతుబంధు పంపిణీ కార్యక్రమం శుక్రవారంతో ముగియనుంది. ఒక్కో ఎకరం ఉన్న రైతుల నుంచి మొదలుకుని పెట్టుబడి సాయాన్ని విడుదల చేస్తున్నారు. ఐదెకరాలకు మించి ఉన్న రైతులకు రైతుబంధు జమ అవుతోంది. ఈ రెండు రోజుల వ్యవధిలో మొత్తం రైతులకు రైతుబంధును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.