డైట్‌ సెట్‌కు 60.65శాతం హాజరు

by Shyam |
డైట్‌ సెట్‌కు 60.65శాతం హాజరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎడ్యూకేషన్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం డైట్ సెట్ నిర్వహించారు. రాష్ట్రంలో 25కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు రెండు సెషన్స్‌లో కలిపి 60.65శాతం హాజరయినట్టు సెట్ కన్వీనర్ కృష్ణారావు తెలిపారు. అన్ని విభాగాల్లో కలిపి 14,036 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 8,513 మంది హాజరయ్యారు. డైట్ సెట్ పరీక్షను తె.మీ కోసం 5,901 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,335 (56.52%) మంది పరీక్ష రాశారు. ఇం.మీ-6,681, ఉర్దూ-1,454 మంది దరఖాస్తు చేసుకోగా మధ్యాహ్నం 3-5 వరకు పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం సెషన్‌కు 8,135 మంది విద్యార్థులకు గాను 5,178 (63.65%) మంది హాజరయ్యారు.

Advertisement

Next Story