- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ సాబ్.. మాకు ఎందుకీ ‘శిక్ష’.. ఆరేళ్ల బాలిక వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో ఆన్‌లైన్ క్లాసులు తెర మీదకు వచ్చాయి. ఈ ఆన్‌లైన్ క్లాసుల కారణంగా చిన్నారులు, విద్యార్ధులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆన్‌లైన్ క్లాసుల పేరిట విద్యా సంస్థలు ఫీజులు దండుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారి ఓ వీడియోలో.. ఆన్‌లైన్ క్లాసుల ద్వారా తమకు ఇస్తున్న హోం వర్క్‌పై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసింది.
https://twitter.com/NamrataWakhloo/status/1398605351008702465?s=20
చిన్న పిల్లలకు ఇంత హోం వర్క్ ఎందుకు.?. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాకు ఆన్‌లైన్ క్లాసులు అవసరమా? అని అడిగింది. నేను 6,7వ తరగతి విద్యార్థిని కాదు.. చిన్న పిల్లలం అంటూ చిన్నారి తెలిపింది. చిన్నారి ఫిర్యాదుపై జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. హోం వర్క్ తగ్గించాలని విద్యాశాఖ అధికారులను కోరారు. 48 గంటల్లో కొత్త పాలసీ తయారు చేయాలని విద్యాశాఖను ఆదేశించారు.