బ్రేకింగ్: శ్రీరాం సాగర్ జలాశయంలో ఏడుగురు గల్లంతు

by Anukaran |   ( Updated:2021-04-02 01:34:30.0  )
6 People Drowned, Godavari River, pochampadu, nizamabad
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ జలాశయంలో శుక్రవారం ఏడుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరి మృతదేహాలు లభించాయి. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మరో నలుగురి ఆచూకీ కోసం కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

గల్లంతైనవారు మాక్లూర్ మండలం డికంపల్లి గ్రామానికి చెందిన జిలకర సురేష్ (40), జిలకర యోగేష్ (16) నిజామాబాద్ నగరం ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్ (40) బొబ్బిలి సిద్ధార్థ (16), బొబ్బిలి శ్రీకర్ (16), మాక్లూర్ మండలం గుత్పకు చెందిన దోడ్లే రాజు (24)గా గుర్తించారు. మాక్లూర్ మండలం మాణిక్ బండార్ గ్రామానికి చెందిన ధర్పల్లి రవికాంత్ (15) బయటపడ్డాడు. లోతు తెలియక స్నానానికి దిగి గల్లంతయ్యారని భావిస్తున్నారు.

Advertisement

Next Story