సూర్యాపేటలో ఆరుగురికి కరోనా పాజిటివ్

by vinod kumar |   ( Updated:2020-04-06 03:15:57.0  )
సూర్యాపేటలో ఆరుగురికి కరోనా పాజిటివ్
X

దిశ నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా ఆరుగురికి కరోనా సోకినట్లు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొనడం ద్వారా కరోనా బారిన పడినట్లు అధికారులు నిర్ధారించారు. అతని బంధువులైన నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన ఆరుగురికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా కేసులు పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.

tags;Suryapet,corona positive,collector T.vinay krishna reddy

Advertisement

Next Story

Most Viewed