పడక సుఖం కోసం భార్య దారుణ హత్య.. భర్తకు ఏం శిక్ష విధించారంటే..?

by Anukaran |   ( Updated:2021-11-11 11:51:23.0  )
HIGH-COURT-2
X

దిశ, కామారెడ్డి : శారీరక సుఖం కోసం భార్యను తరచూ వేధిస్తూ చివరకు తలపై సుత్తితో మోది హత్య చేసిన కసాయి భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కామారెడ్డి 9వ అదనపు కోర్టు న్యాయమూర్తి రమేష్ బాబు తీర్పు వెలువరించారు. 2019 డిసెంబర్ 15వ తేదిన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం కన్నారెడ్డి గ్రామానికి చెందిన పేరుపల్లి లక్ష్మీ(45) భర్త మోహన్ చేతిలో దారుణ హత్యకు గురైంది. శారీరక సుఖానికి అలవాటు పడిన మోహన్ భార్యను నిత్యం వేధించేవాడు.

అయితే, భార్య అందుకు నిరాకరించే సరికి 2019 డిసెంబర్ 18న రాత్రి పడుకున్న సమయంలో భార్య లక్ష్మీ తలపై సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో లక్ష్మీ కొడుకు గోపాల్ ఫిర్యాదు మేరకు మోహన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణ, వైద్యుల పోస్టుమార్టం నివేదిక, సాక్షుల కథనం ప్రకారం భర్త మోహన్ హత్య చేసినట్టుగా నిర్దారిస్తూ గురువారం 9వ అదనపు కోర్టు న్యాయమూర్తి రమేష్ బాబు ఈ మేరకు 5ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును చెప్పారు.

Advertisement

Next Story