కూల్‌డ్రింక్‌ అనుకుని పురుగుల మందు తాగేశాడు..చివరకు..!

by Sumithra |   ( Updated:2021-12-15 08:19:26.0  )
కూల్‌డ్రింక్‌ అనుకుని పురుగుల మందు తాగేశాడు..చివరకు..!
X

దిశ, నూగురు వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల గ్రామ పంచాయతీ పరిధిలోని తోగుబోరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కూల్‌ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కొందరు ఆదివాసి కుటుంబాలు తోగుబోరు గ్రామంలోకి వలస కూలీలుగా వచ్చారు. పిల్లలను చదివిస్తూ పనులకు వెళ్తున్నారు. వీరిలో ఓ కుటుంబానికి చెందిన పునెం సురేష్ అనే ఐదో తరగతి విద్యార్థి బుధవారం మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. ఈ సమయంలో పొలం కోసం తల్లిదండ్రులు తెచ్చిన పురుగుల మందును చూసి.. కూల్ డ్రింక్ అనుకుని తాగేశాడు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యాహ్నం ఇంటికొచ్చిన తల్లిదండ్రులు కొడుకు విగతాజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story