- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతూ.. విజృంభిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా.. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో ఒక్కరోజే 55 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏయూ హాస్టళ్లలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. అంతేగాకుండా.. విద్యార్థుల తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందవద్దు అని ఏయూ శనివారం ప్రకటన విడుదల చేసింది. రెండ్రోజుల క్రితం ఇంజినీరింగ్ కాలేజీలో హాస్టల్ విద్యార్థికి కరోనా సోకిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీ క్వారంటైన్‌లో కొనసాగుతోంది. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున యాజమాన్యం అప్రమత్తం అయింది. ఏయూలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.