సత్తెనపల్లి ఎస్సైను సస్పెండ్ చేస్తున్నాం: ఐజీ ప్రభాకర్‌ రావు

by srinivas |   ( Updated:2020-04-21 00:32:11.0  )
సత్తెనపల్లి ఎస్సైను సస్పెండ్ చేస్తున్నాం: ఐజీ ప్రభాకర్‌ రావు
X

రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన మహమ్మద్ గౌస్ అనే యువకుడు తండ్రి మందుల కోసం బయటకు రాగా అతడిని ఏఎస్సై రమేష్ బాబు చితక్కొట్టడంతో అతను మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్ నిబంధనలు మీరితే కొట్టి చంపేస్తారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై గుంటూరు రేంజి ఐజీ ప్రభాకర్‌ రావు వివరణ ఇచ్చారు. సత్తెనపల్లిలో జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. షేక్‌గౌస్‌ అనే వ్యక్తిని ఆపేందుకు అక్కడ విధులు నిర్వహిస్తోన్న ఎస్‌ఐ రమేశ్‌ బాబు ప్రయత్నించారని తెలిపారు. అయితే, అప్పటికే చెమటలు పట్టిన షేక్‌ గౌస్‌ కిందపడిపోయాడని వెల్లడించారు.

దీంతో పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారని, చికిత్స పొందుతూ అతడు ఆసుపత్రిలో మరణించాడని ప్రభాకర్‌రావు వివరించారు. షేక్‌ గౌస్‌కు హృదయ సంబంధ సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతేగాక, అతడి మృతదేహంపై గాయాలేవీ లేవని ఆయన తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని వివరించారు. అసలు నిజాలు విచారణలో తేలతాయని తెలిపారు. ఎస్‌ఐను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలు బయటకు రావద్దని ఐజీ సూచించారు.

Tags: lock down, guntur district, sattenapalli, mahammed gouse, asi ramesh babu, ig prabhakarrao

Advertisement

Next Story

Most Viewed