ఏపీ కరోనా @ 2,841

by srinivas |
ఏపీ కరోనా @ 2,841
X

దిశ ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న కొద్దీ కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 54 కరోనా పాజిటివ్ కేసులు తేలయాని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 45 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,841కి చేరుకుంది. ఇందులో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 824 కాగా, ఇప్పటివరకు 1,958 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలులో బుధవారం ఒకరు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 59కి చేరింది. బుధవారం మొత్తంగా 9,858 శాంపిళ్లను పరీక్షించారు.

Advertisement

Next Story

Most Viewed