నిజామాబాద్ జిల్లాలో 54 పాజిటివ్ కేసులు

by vinod kumar |
నిజామాబాద్ జిల్లాలో 54 పాజిటివ్ కేసులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో బుధవారం 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం తొలిసారి అర్థ సెంచరీ దాటిన కరోనా కేసులు, రెండో రోజు వరుసగా పెరగడంతో జనాలు భయాందోళనకు గురువుతున్నారు. బుధవారం నిజామాబాద్ మేయర్‌కు కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. మేయర్‌తో పాటు ఆమె భర్త, ఆత్తకు పరీక్షలను నిర్వహించగా వారిద్ధరికీ మాత్రం పాజిటివ్ రిపోర్టులు వచ్చాయని అధికారులు తేల్చారు. మాజి సీనియర్ కార్పొరేటర్‌కు పాజిటివ్ అని రిపోర్టులలో తేలింది. జిల్లాలో కరోనా కేసులు బుధవారం నాటితో 543 కేసులు అయ్యాయి. జిల్లా కేంద్రానికి చెందిన ఒక మైనార్టీ ఎరియా కార్పొరేటర్‌కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాగా ఇవాళ ఉదయం ర్యాపిడ్ యాంటిజన్ టెస్టులో మేయర్ నీతు కిరణ్‌కు పాజిటివ్ తేలగా, తరువాత వైరాలజీ ల్యాబ్‌లో చేసిన టెస్టులో నెగిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story