జీహెచ్ఎంసీలో 50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక

by Shyam |
జీహెచ్ఎంసీలో 50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ‌కు హ‌రిత‌హారంలో భాగంగా 2020-21లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 50 ల‌క్ష‌ల మొక్క‌లు నాటేందుకు ప్ర‌ణాళిక రూపొందించిన‌ట్లు క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ సోమవారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. న‌గ‌రంలో ప‌చ్చ‌ద‌నాన్ని పెంచి కాలుష్యాన్ని నియంత్రించి, ఉష్ణోగ్ర‌త‌ల‌ను త‌గ్గించి ఆరోగ్య‌క‌ర వాతావ‌ర‌ణాన్ని పెంపొందించేందుకు హ‌రిత‌హారం కింద ప్లాంటేష‌న్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు అందులో తెలిపారు. సూరారం, మాద‌న్న‌గూడ‌, నాద‌ర్‌గుల్‌లో అర్భ‌న్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. న‌గ‌రంలోని అన్ని జోన్లు, చెరువు గ‌ట్లు, నాలాల ఒడ్డు ప్ర‌దేశాలు, మూసీకి ఇరువైపులా మొక్క‌లు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. చెరువుగ‌ట్లు, బ‌ఫ‌ర్ జోన్ ఏరియాల్లో ఎక్కువ మొత్తంలో మొక్క‌లు నాట‌నున్న‌ట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఖాళీ ప్ర‌దేశాల‌ను ట్రీ పార్క్‌లుగా అభివృద్ధి చేసేందుకు ప్లాంటేష‌న్‌తో పాటు వాకింగ్ ట్రాక్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్ల భాగ‌స్వామ్యంతో కాల‌నీల‌లో ఉన్న అంత‌ర్గ‌త రోడ్ల‌కు ఇరువైపులా, ఖాళీ ప్ర‌దేశాల్లో మొక్క‌లు నాట‌నున్న‌ట్లు తెలిపారు. హ‌రిత‌హారం కింద నాటేందుకు న‌ర్స‌రీల్లో మొక్క‌ల‌ను సిద్ధం చేసిన‌ట్లు క‌మిష‌న‌ర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed