టెంపరేచర్@50 డిగ్రీలు

by Shamantha N |
టెంపరేచర్@50 డిగ్రీలు
X

న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో మాడు పగిలే ఎండలు కొడుతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే అక్కడి ప్రజలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఓవైపు కరోనా గుబులు పుట్టిస్తుంటే మరోవైపు వడగాలులు సెగలు కక్కిస్తున్నాయి. మంగళవారం మనదేశంలో అత్యధికంగా ఎండ తీవ్రత నమోదైంది. రాజస్తాన్‌లోని చురులో దేశంలోనే అత్యధికంగా 50డిగ్రీల సెంట్రిగేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, దేశరాజధాని ఢిల్లీలో గత రెండు దశాబ్దాల కాలంలో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత మంగళవారం నమోదైంది. ఇక్కడ 47.6 డిగ్రీల ఎండ కొట్టింది. మంగళవారం ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 15 నగరాల జాబితాలో 10 మనదేశంలోనే ఉన్నాయని ఓ ట్రాకింగ్ వెబ్‌సైట్ వెల్లడించడం గమనార్హం. అయితే, ఈ ఎండ తీవ్రత వారాంతం వరకూ కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు ఇంటికే పరిమితం కావాలని పలు సూచనలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed