హోటల్‌లో విద్యార్థులు ఏం చేశారో తెలుసా!

by Sumithra |
హోటల్‌లో విద్యార్థులు ఏం చేశారో తెలుసా!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో విద్యార్థులు గంజాయి సేవిస్తూ పోలీసులకు చిక్కిన వ్యవహారం కలకలం రేపుతోంది. చదువుకుంటున్న వయస్సులోనే మత్తు పదార్థాలకు బానిస కావడంతో బాధిత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఖైరాతాబాద్‌‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ హోటల్‌లో రూమ్ అద్దెకు తీసుకున్న ఐదుగురు విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. దీనికి తోడు వారి వద్ద ఏకంగా 2 కిలోల గంజాయి దొరికింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story