- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐపీఎల్ ఆడటానికి వారికి అనుమతి
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్‌లో ఆడటానికి వీలుగా ఐదుగురు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లను అనుమతిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఐపీఎల్ జరిగే సమయంలోనే సఫారీ జట్టు పాకిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడాల్సి ఉన్నది. అయితే బీసీసీఐ విజ్ఞప్తి పేరకు కసోగి రబాడ (ఢిల్లీ క్యాపిటల్స్), క్వింటన్ డి కాక్ (ముంబయి ఇండియన్స్), లుంగి ఎన్‌గిడి (చెన్నై సూపర్ కింగ్స్), డేవిడ్ మిల్లర్ (రాజస్తాన్ రాయల్స్), ఎన్రిక్ నోర్జే (ఢిల్లీ క్యాపిటల్స్) లను విడుదల చేసింది. వీరందరూ 14వ సీజన్ మొదటి మ్యాచ్ నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తున్నది. ‘బీసీసీఐ, క్రికెట్ సౌతాఫ్రికా మధ్య ఉన్న ఒప్పందం మేరకు ఆ ఐదుగురు ఆటగాళ్లను ఐపీఎల్ కోసం విడుదల చేస్తున్నాము’ అని సీఎస్ఏ ఒక ప్రకటనలో పేర్కొన్నది. సౌతాఫ్రికా, పాకిస్తాన్ మధ్య ఏప్రిల్ 2 నుంచి 16 వరకు టీ20 సిరీస్ జరుగనున్నది. అయితే ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 14వ సీజన్‌లో పాల్గొనడానికి ఆటగాళ్లందరూ అంతకు 10 రోజుల ముందే బయోబబుల్‌లో ప్రవేశించాల్సి ఉన్నది.