మాద్వార్ గ్రామంలో కరోనా కలకలం

by Shyam |
మాద్వార్ గ్రామంలో కరోనా కలకలం
X

దిశ, మహబూబ్ నగర్: విదేశాల నుంచి వచ్చిన 2ఇద్దరు ఎన్నారైలను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5యువకులు పికప్ చేసుకుని డ్రాప్ చేశారు. ఈ యువకులు మాద్వార్ గ్రామానికి చెందిన వారు. అయితే వీరందరిని మక్తల్ మండల తహసీల్దార్, గిర్దావరీ, ఎసై,డాక్టర్లు, మాద్వార్ సర్పంచ్, విలేకరుల సమక్షంలో 14రోజులు సమాజానికి దూరంగా ఉండాలని చెప్పి స్టాంప్ వేసి సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపించారు.దీంతో ఆ ఐదుగురిలో ఒక్కరికైనా కరోనా సోకినట్టయితే గ్రామంలో ఎంతమందికి వస్తుందోనని గ్రామస్తులు హడలిపోతున్నారు. కారులో ప్రయాణించిన ఎన్నారైలను గాంధీ హాస్పిటల్‌లోని క్వారంటైన్‌లో పెట్టి పరీక్షలు చేస్తున్నారు. మాద్వార్ గ్రామంలో కరోనా కేసులు పాజిటివ్, లేదా నెగిటివ్ తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Tags : mandawar, 5 nri, corona, quarantine, gandhi hospital

Advertisement

Next Story