నల్గొండలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

by Anukaran |   ( Updated:2020-09-03 22:35:43.0  )
నల్గొండలో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ :

నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్నకారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్నహెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ పిల్లర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది.ఈ ఘటన హైదరాబాద్ – సాగర్ హైవే దారిలో చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద శుక్రవారం ఉదయం వెలుగుచూసింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మొదట నలుగురు వ్యక్తులు ప్రమాదస్థలిలోనే మరణించగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో పోలీసులు, స్థానికులు అతికష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed