మహారాష్ట్రలో ఎన్ కౌంటర్

by Shamantha N |
మహారాష్ట్రలో ఎన్ కౌంటర్
X

దిశ ప్రతినిది, కరీంనగర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. గడ్చిరోలి జిల్లా ఘ్యారపట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సీ 60 బెటాలియన్ కమాండోలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులపై మావోలు కాల్పులకు దిగారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాగా మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్టు గడ్చిరోలి జిల్లా పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతన్నాయని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story