ప్రేమపెళ్లి.. నలుగురి దారుణ హత్య

by Shamantha N |
ప్రేమపెళ్లి.. నలుగురి దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ పెళ్లి అబ్బాయి కుటుంబానికి శాపంలా మారింది. వివాహం చేసుకున్న నాటి నుంచి ఇరుకుటుంబాల మధ్య తీవ్ర వివాదాలు చేలరేగాయి. ఈ క్రమంలో ఓ ముఠా అబ్బాయి కుటుంబంపై దాడి చేసి దారుణంగా నరికి చంపారు. అయితే, అందులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని రాయ్​చుర్​ జిల్లా సింధనూర్​ నగరంలో శనివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..

సింధనూరు నగరంలో ఓ యువతి, యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిని ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దాంతో పాటు గత కొంత కాలంగా రెండు కుటుంబాల మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. శనివారం ఆ గొడవలు కాస్త తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే అబ్బాయి కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను కాపు కాచి ఓ ముఠా దారుణంగా కత్తులతో నరికి చంపింది. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story