- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఒక్క రోజే 491 కొత్త కేసులు.. ఐదుగురు మృతి
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా, 22,371 శాంపిళ్లను పరీక్షించగా, 491మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు వైద్య ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 390 మంది ఏపీ వాసులుండగా, 101మంది ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చినవారున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,452కు చేరింది. వీరిలో ఏపీకి చెందినవారు 6,620మంది ఉండగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు 326, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 1,506 మంది ఉన్నారు.
శుక్రవారం ఉదయం 9గంటల నుంచి శనివారం ఉదయం 9గంటల వరకు 138మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూల్‌లో ఇద్దరు, గుంటూరులో ఒక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 101కి చేరగా, ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4,111కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,240మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రకాశం, అనంత, శ్రీకాకుళం జిల్లాల్లో నేటి నుంచి లాక్‌డౌన్
రాష్ట్రంలోని ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం ఉదయం నుంచి లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రకాశంలోని ఒంగోలు, చీరాలలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇటీవల ఓ ఇంట్లో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరవ్వగా, అందులో ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో పలాస కాశీబుగ్గలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి నియోజకవర్గం మొత్తం లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. ఇక అనంతపురం జిల్లా కేంద్రం సహా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత ఎవరూ రోడ్డు మీదకు రాకూడదు. ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తాయి. మాంసం దుకాణాలు ఆదివారం పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఇక వారం రోజుల తర్వాత పరిస్థితిని బట్టి లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు.
అనంతపురంలో 789కు చేరిన కేసులు..
అనంతపురం జిల్లాలో తాజాగా, 97 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో ఇప్పటి వరకు 789 మందికి కరోనా సోకితే, 553 మంది చికిత్స పొందుతున్నారు. మరో 230 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ కారణంగా ఆరుగురు మృతి చెందారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లాలో కొత్తగా 16 మందికి కరోనా సోకింది. ఇప్పటి వరకు 175 మంది ఈ వైరస్ బారినపడగా, 92 మంది కోలుకున్నారు. 78 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు మరణించారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలో తాజాగా, ఒక్క కేసూ నమోదు కాలేదు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 59గానే ఉండగా, 36 మంది చికిత్స పొందుతున్నారు. 22 మంది కోలుకున్నారు. ఒక్కరు మరణించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కొత్తగా 65 కేసులు నమోదైతే ఇప్పటి వరకు 498 మందికి కరోనా సోకింది. ఇందులో 393 మంది చికిత్స పొందుతున్నారు. 105 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా ఎవరూ మృత్యువాత పడలేదు.
చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో..
చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో 51 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో ఇప్పటి వరకు 515 మందికి కరోనా సోకితే, 242 మంది చికిత్స పొందుతున్నారు. 268 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఐదుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో 982 మందికి కరోనా సోకితే 521 మంది చికిత్స పొందుతున్నారు. 428 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఈ జిల్లాలో కరోనా కారణంగా 33 మరణించారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లాలో 41 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 485కు చేరింది. ప్రస్తుతం 213 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 267 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఐదుగురు మృతి చెందారు.
గుంటూరు జిల్లాలో..
గుంటూరులో కొత్తగా 17 మందికి కరోనా సోకింది. జిల్లాలో ఇప్పటి వరకు 742 మంది వైరస్ బారినపడితే 238 మంది చికిత్స పొందుతున్నారు. 493 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది మరణించారు.
విశాఖలో..
విశాఖపట్టణం జిల్లాలో 261 పాజిటివ్ కేసులు నమోదైతే 109 మంది చికిత్స పొందుతుండగా, 151 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ జిల్లాలో కరోనా కారణంగా ఒకరు మరణించారు.
నెల్లూరులో..
నెల్లూరులో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ 459 మందికి కరోనా సోకగా, 213 మంది చికిత్స పొందుతున్నారు. 246 మంది డిశ్చార్జ్ అయ్యారు. నలుగురు మరణించారు. అలాగే, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు నమోదైంది. జిల్లాలో 78 మందికి కరోనా సోకితే, 47 మంది చికిత్స పొందుతున్నారు. 31 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరణాలు సంభవించలేదు. కడప, కర్నూలు, వైజాగ్ జిల్లాల్లో 15 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. కడపలో ఇప్పటి వరకు 330 మందికి కరోనా సోకితే, 188 మంది చికిత్స పొందుతున్నారు. 142 మంది కోలుకున్నారు. ఈ జిల్లాలో ఎవరూ మరణించలేదు. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 1,247 మందికి కరోనా సోకింది. ఏపీలో అత్యధిక కరోనా కేసులు ఈ జిల్లాలోనే నమోదయ్యాయి. మరోవైపు రికవరీ రేట్ కూడా ఈ జిల్లాలోనే అధికంగా ఉంది. ప్రస్తుతం 485మంది చికిత్స పొందుతుంటే 729 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే, అత్యధికంగా 33మంది ఈ జిల్లా వాసులే మరణించారు.
ఈ జిల్లాల్లో రోజుకు 3వేల టెస్టులు చేయాలి: నీలం సాహ్నీ
లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండానే కృష్ణా, గుంటూరు, కర్నూల్ జిల్లాల్లో అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. జ్వరం, దగ్గు వంటి సమస్యలతో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేయాలని సూచించారు. ఆయా జిల్లాలో రోజుకు 3వేల టెస్టులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రైమరీ, సెకండరీ సర్వే లెన్స్ బృందాలు మరింత చురుగ్గా పనిచేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.