- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం
దిశ, న్యూస్‌బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 45బస్తీ దవాఖానాలను ఈ నెల 22న ప్రారంభించనున్నట్టు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. దోమల్‌గూడ రోజ్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానాలో గురువారం వసతులను పరిశీలించారు. బస్తీ దవాఖానాలో ఉచితంగా 57రకాల రక్త పరీక్షలు, 150 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొన్నారు. నగరంలో ప్రస్తుతం 85 అర్బన్ హెల్త్ సెంటర్లు, 123బస్తీ దవాఖానాలు ఉన్నట్లు వివరించారు. కొత్తగా ప్రారంభించే 45బస్తీ దవాఖానాలతో కలిపి మొత్తం వాటి సంఖ్య 168కి పెరుగుతుందని వెల్లడించారు. బస్తీ దవాఖానాల్లో వైద్యులు, నర్సులు, ప్యారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. రాబోయే రోజుల్లో ప్రతివార్డుకు మూడు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలనే యోచన ఉన్నట్లు తెలిపారు. కొత్త బస్తీ దవాఖానాల ప్రారంభోత్సవంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, హరీష్‌రావు, ఈటెల రాజేందర్, మహ్మద్ మహమూద్ అలీ, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొంటారని మేయర్ తెలిపారు.