- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలుషిత ఆహారం తిని 42 మందికి అస్వస్థత
దిశ, కడప: వైయస్సార్ జిల్లా రాజుపాలెం మండలంలోని అరకట వేముల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన దాదాపు 42 మంది అస్వస్థత కు గురయ్యారు. కుటుంబంలో జరిగిన ఒక వేడుకలో ఉడకేసిన అలసందలను తినడంతో అస్వస్థతకు గురి అయ్యి ఆస్పత్రి పాలయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఎస్సీ కాలనీలో నివాసం వుండే కొంగలి షడ్రక్ అనే వ్యక్తి కుమార్తె వేడుకలో భాగంగా వారి బందువులు ప్రొద్దుటూరు పట్టణంలోని కిరాణా దుకాణంలో కొనుగోలు చేసిన దాదాపు కొన్ని కిలోల అలసందలను తమ ఇంటిదగ్గ రే ఉడకబెట్టుకొని అరకటవేములలోని వేడుకలో భాగంగా పాల్గొన్న వారికి పంచి పెట్టారు.
ఈ ఉడకేసిన అలసంధలను తిన్న కొంతమంది శుక్రవారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ తన సొంత వాహనం ఆటోలో బయలుదేరి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. వీరితో పాటు వేడుకలో పాల్గొన్న మిగిలిన చాలా మందికి వుదయం 9 గంటల నుండి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాదపడటంతో విషయం తెలుసుకున్న గ్రామంలో నివాసం వుండే ఉమా మహేశ్వరి, బయమ్మ అనే ఆశా కార్యకర్తలు వారితో పాటు ఏ ఎన్ ఎం సావిత్రి, ఎం ఎల్ హెచ్ పీ జ్యోష్ణ లు అస్వస్థతకు గురైన వారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం తెలుసుకొని రాజుపాలెం ప్రభుత్వ ఆస్పత్రిలోని డాక్టర్ల మంజుల, నిఖిలలకు విషయం తెలిపారు.
దీంతో అప్రమత్తమైన డాక్టర్ లు వెంటనే విరేచనాలతో బాధపడుతున్న వారిని రాజుపాలెం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేలా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అయితే వీరిలో 22 మంది రాజుపాలెం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిక కాగా, మిగిలిన వారు నేరుగా ప్రొద్దుటూరు లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. రాజుపాలెం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన 15 మంది అదే రోజు మధ్యాహ్నానికి త్వరగా కోలుకుని ఇంటికి చేరగా,7 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ ల సిఫారసు మేరకు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరు చిన్నపిల్లలు కూడా వున్నారు.ప్రొద్దుటూరు ఆస్పత్రిలో చికిత్స పొందారు.అరకట వేముల గ్రామంలో జిల్లా వైద్యాధికారులు.పర్యటించి వైద్యసేవలు అదించడంతో పాటు జరిగిన ఘటన పై వివరాలు సేకరించారు.