- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెలలో 41వేల మరణాలు.. 61.54 లక్షల కేసులు
న్యూఢిల్లీ: సెకండ్ వేవ్ అత్యధిక మరణాలతో తొలి వేవ్ కంటే ప్రాణాంతకంగా మారింది. ఈ నెలలో మహమ్మారి విజృంభణకు అడ్డూ అదుపులేకుండా పోయింది. నిపుణులు వచ్చే నెలలో పీక్ స్టేజ్‌కు చేరే అవకాశముందని అంచనాలు వేస్తుండటంతో మరింత ఆందోళనలు చుట్టుముడుతున్నాయి. పీక్ స్టేజ్‌కు ముందు నెల ఏప్రిల్‌లోనే కరోనా విలయానికి దేశవ్యాప్తంగా విషాదపరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించినవారిలో 20శాతానికి మించి కేవలం ఏప్రిల్ నెలలోనే కన్నుమూయడం వైరస్ తీవ్రతను తెలుపుతున్నది. మనదేశంలో మొత్తం మరణాలు 2.04 లక్షలకు చేరిన సంగతి విదితమే. ఇందులో ఏప్రిల్ 1 నుంచి ఈ రోజు నాటికి మరణించినవారి సంఖ్య 40వేలను మించింది. ఏప్రిల్ 1న కరోనా మరణాలు 1,62,927గా ఉన్నాయి. కానీ, నేడు ఈ సంఖ్య 2,04,832కు చేరింది.
ఏప్రిల్‌లోనే 30శాతం కేసులు
ఈ నెలలోనే కొత్త కేసులూ భారీగా పెరిగాయి. తొలిసారిగా మనదేశం రెండు లక్షల మార్క్‌ను దాటడంతోపాటు అత్యధిక కేసులు రిపోర్ట్ చేసిన దేశంగానూ ఈ నెలలోనే భారత్ రికార్డు బద్దలు చేసింది. ఏప్రిల్ 1న మనదేశంలో మొత్తం కేసులు 1,22,21,665 ఉండగా, తాజాగా ఈ సంఖ్య 1,83,76,524కు పెరిగాయి. అంటే ఈ నెలలోనే 61.54 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే మొత్తం కేసుల్లో దాదాపు 30శాతం కేసులు ఇవే ఉండటం గమనార్హం.