షాకింగ్..12 గంటల్లో 17 కేసులు.. ఏపీ @ 40

by  |
షాకింగ్..12 గంటల్లో 17 కేసులు.. ఏపీ @ 40
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. కేవలం 12 గంటల్లోనే ఊహించని విధంగా పదుల సంఖ్యలో కేసులు పెరిగిపోయాయి. ఇంతవరకు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల్లో అగ్రస్థానంలో ఉన్న వైజాగ్‌ను ప్రకాశం జిల్లా వెనక్కి తోసేసింది.

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ మేరకు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది. నిన్న సాయంత్రం వరకు 23 కేసులుగా ఉన్న ఏపీలో గడచిన 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్ ప్రాంతంలో ఈ నెల 13 నుంచి 15 మధ్య జరిగిన మత ప్రార్థనలకు వెళ్లిన వారితో పాటు, మక్కాకు వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారికే కరోనా సోకినట్టు గుర్తించారు.

ప్రకాశంలో అత్యధికంగా 11 కేసులు నమోదవ్వగా, చీరాల పట్టణంలో కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. గత రాత్రి 164 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 17 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగిలిన 147 మందికి నెగిటివ్‌ రిపోర్ట్ వచ్చింది. జిల్లాల వారిగా చూస్తే… గుంటూరు- 9, విశాఖ – 6, కృష్ణా – 5, తూ.గో – 4, అనంతపురం – 2, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అనంతపురం, లేపాక్షిలో ఇద్దరికి (వీరిద్దరూ మక్కా వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్ అయ్యారు), ప్రకాశం జిల్లాలో ఇద్దరు (ఒకరు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్, మరొకరు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తి), గుంటూరులో ఐదు కేసులు (కరోనా రోగికి దగ్గరగా ఉన్న మహిళ, ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తితో కాంటాక్ట్ పెట్టుకున్న ముగ్గురు, ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తి), కృష్ణా జిల్లాలో ఒకటి (ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తితో కాంటాక్ట్) ఉన్నాయి.

ప్రకాశం జిల్లా కందుకూరు, చీరాల, కుంకల మర్రి ప్రాంతాల నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఆరుగురికి, తూర్పు గోదావరి జిల్లాలో మదీనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో వారందర్నీ ఐసోలేషన్ వార్డుకు తరలించిన అధికారులు, వీరితో కాంటాక్ట్ లో ఉన్న వారిని గుర్తించే పనిలో పడ్డారు.

Tags: corona virus, positive cases, prakasham, delhi preyears, covid-19, isolation


Next Story

Most Viewed