‘పెళ్లి చూపులు’ ఎప్పటికీ ప్రత్యేకమే : రితూ

by Jakkula Samataha |
‘పెళ్లి చూపులు’ ఎప్పటికీ ప్రత్యేకమే : రితూ
X

హీరోయిన్ రితూ వర్మ టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, మాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు, విజయాలతో దూసుకుపోతుంది. అయితే, తనకు బ్రేక్ ఇచ్చిన చిత్రం మాత్రం పెళ్లి చూపులు. మొబైల్ క్యాంటీన్ ఐడియాకు చిన్న లవ్ స్టోరీ యాడ్ చేసి తెరకెక్కించిన ఈ చిత్రం.. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సక్సెస్ అందుకుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలై నాలుగేండ్లు పూర్తైన సందర్భంగా మూవీ యూనిట్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పింది రితూ.

కరోనా మహమ్మారి ప్రారంభమైన నుంచి అభినందన అనేది విలువైనదని నేర్చుకున్నాను అన్న రితూ.. పెళ్లి చూపులు మూవీ తనకు చాలా స్పెషల్ అని తెలిపింది. చిత్ర అనే క్యారెక్టర్‌ను తనకిచ్చిన డైరెక్టర్ తరుణ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. కొన్ని అనుభవాలు మనతో ఎప్పటికీ ఉండిపోతాయి అని, అలాంటిదే ఈ సినిమా షూటింగ్ సమయం అని తెలిపిన హీరోయిన్.. చిత్రకు బెస్ట్ ప్రశాంత్‌గా నిలిచిన విజయ్ దేవరకొండ‌కు థాంక్స్ చెప్పింది. ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు తెప్పించిన ప్రియదర్శి, అభయ్ లను అభినందించిన రితూ..వివేక్ సాగర్ సంగీతం, నగేష్ బానెల్ మనోహరమైన కెమెరా పనితనం ఎక్సలెంట్‌గా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. కాస్ట్యూమ్స్ డిజైనర్ వెగన్ వెరిందా తన నైపుణ్యంతో పాత్రలకు ప్రాణం పోసిన తీరు అద్భుతం అంది. నిర్మాతలు రాజ్ కందుకూరి, యశ్ రంగినేని‌కు స్పెషల్ థాంక్స్ చెప్పిన భామ.. పెళ్లి చూపులు టీంను మిస్ అవుతున్నట్లు తెలిపింది. అందరితో మళ్లీ కలిసి పని చేయాలని.. అలాంటి మ్యాజిక్ సృష్టించాలని కోరింది.

Advertisement

Next Story

Most Viewed