- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐక్యూతో అదరగొట్టిన చిన్నారి.. బేబీ ఐన్‌స్టీన్‌గా ప్రశంసలు
దిశ, ఫీచర్స్ : మానవ మేధస్సును మనం ‘ఐక్యూ’(ఇంటెలిజెంట్ కోషెంట్) ఆధారంగా లెక్కగడుతుంటాం. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, ప్రముఖ భౌతిక శాస్త్రజ్ఞుడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఐక్యూ స్కోర్ 160 అని తెలిసిన విషయమే. అయితే భారతీయ సంతతికి చెందిన నాలుగేళ్ల దయాల్ కౌర్ మెన్సా ఐక్యూ టెస్ట్‌లో 145 మార్కులు స్కోర్ చేసి ‘జూనియర్ ఐన్‌స్టీన్’గా ప్రశంసలు అందుకుంటోంది.
దయాల్ కౌర్ ప్రస్తుతం వాళ్ల తల్లిదండ్రులతో పాటు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో నివసిస్తోంది. చిన్నప్పటి నుంచి ఎంతో జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్న దయాల్, తన 13 నెలల వయసులో, తన తండ్రి ఒక రోజు ‘వన్ ’అని చెప్పగానే, వెంటనే, దానికి సమాధానంగా ఆమె‘ రెండు ’అని బదులిచ్చింది. దయాల్ తండ్రి రెండు అని చెప్పగానే, ఆమె మూడు అని చెప్పడం ఇలా 15 సంఖ్య వరకు సాగింది. రెండు సంవత్సరాల వయస్సులో, ఆ చిన్నారే అడిగే ప్రశ్నలకు గూగుల్ మాత్రమే సమాధానాలు చెప్పగలిగేదని దయాల్ తండ్రి చెబుతున్నాడు.
చాలా చిన్న వయస్సు నుంచే తమ కుమార్తె ఉన్నత స్థాయి తెలివితేటలను ఎప్పటికప్పుడు గుర్తించిన ఆ తల్లిదండ్రులు ఆమెను ‘మెన్సా’ పరీక్షను రాయించారు. ఎలైట్ మెన్సా హై ఐక్యూ సొసైటీ ఆఫ్ చిల్డ్రన్ పరీక్ష రాసిన అతి పిన్న వయస్కుల్లో దయాల్ కౌర్ ఒకరు కాగా ఆమె ఇందులో 145 మార్కులు సాధించి ఔరా అనిపించింది. దయాల్ కౌర్‌ను మెన్సాకు స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అక్కడ ఆమె సుమారు 2 వేల మంది జూనియర్, టీన్ సభ్యుల సంఘంలో చేరిందని బ్రిటిష్ మెన్సా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ స్టీవనేజ్ అన్నారు. మెన్సాలో మంచి స్కోర్‌తో సర్వత్రా ప్రశంసలు పొందుతున్న దయాల్‌ను అందరూ బేబీ ఐన్‌స్టీన్ లేదా యంగ్ ఐన్‌స్టీన్ అని పిలుస్తున్నారు.