విషాదం.. లోయలో పడిపోయిన వ్యాన్..!

by Sumithra |
విషాదం.. లోయలో పడిపోయిన వ్యాన్..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

నాగర్‌ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ లోయలో పడిపోవడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 12 మంది వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన జిల్లాలోని అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.

వ్యాన్ లోయలో పడిపోవటాన్ని గుర్తించిన స్థానికులు అందులో చిక్కుకున్న పలువురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా తెలుస్తుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.

Advertisement

Next Story