వీడని మిస్టరీ..

by Sumithra |
వీడని మిస్టరీ..
X

మేడారం జాతరలో కనిపించకుండా పోయిన మూడేళ్ల బాలుడి ఆచూకీ నేటికి లభించలేదు. జాతర ముగిసి రెండ్రోజులు అయినా తమ కుమారుడి ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకివెళితే.. పెద్దపల్లి జిల్లాకు చెందిన మూడేండ్ల విన్నూ మేడారం జాతరలో అదృశ్యమయ్యాడు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలను ఎత్తుకెళ్లే మహిళల ముఠా పనే కావచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story