- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
థానే వచ్చిన 38 మంది వలస కూలీలకు పాజిటివ్
దిశ, ఏపీ బ్యూరో : దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఉపాధి, తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక్ రైళ్ల ద్వారా వారి సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నారు.ఈ క్రమంలోనే సోమవారం చెన్నై నుంచి శ్రీకాకుళానికి 889 మంది వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకోగా, మంగళవారం మహారాష్ట్రలోని థానే నుంచి కర్నూల్‌కు 930 మంది వలస కార్మికులు శ్రామిక్ రైల్‌లో వచ్చారు. వారిలో సుమారు 250 మందికి కోవిడ్-19టెస్టులు జరపగా 38 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టు నిర్ధారణ అయింది. వారిలో కర్నూల్‌కు జిల్లాకు చెందిన 37 మంది, కడపలో ఒకరికి పాజిటివ్ తేలింది. దీంతో వారందరినీ అధికారులు క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. వీరికి క్లస్టర్ స్ట్రాటజీ అవసరం లేదని, పాజిటివ్ వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న అందరినీ గుర్తించి ఇతర రాష్ట్రాలకు సమాచారం ఇస్తామని ఏపీ అధికారులు చెప్పారు. కాగా, వైరస్ బారిన పడిన వారు ముంబైలోని మసీద్ బండారీ ఫిష్ మార్కెట్‌లో కూలీలుగా పనిచేస్తున్నట్టు తేలింది.