నాగర్‌కర్నూలు జిల్లాలో 36 కరోనా కేసులు

by vinod kumar |
నాగర్‌కర్నూలు జిల్లాలో 36 కరోనా కేసులు
X

దిశ, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత వారం రోజులుగా ప్రతిరోజు 50కి మించి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం 36 కేసులు నమోదయినట్టు జిల్లా అధికారులు తెలిపారు. అచ్చంపేటలో 9 కేసులు నమోదు కాగా, అమ్రాబాద్‌లో 2, బిజినపల్లిలో 4, కల్వకుర్తిలో 1, కొల్లాపూర్ 3, నాగర్‌కర్నూల్ 13, పదరలో 1, పెంట్లవెల్లిలో 3 కేసులు నమోదయ్యాయి. జిల్లా మొత్తంగా ఇప్పటివరకూ 365 కేసులు నమోదయ్యాయి. 9 మంది మృత్యువాత పడ్డారు. ప్రజలు ఇప్పటికైనా భౌతికదూరం పాటిస్తూ తప్పకుండా మార్కులు ధరించాలని అధికారులు పిలుపునిచ్చారు. ఇప్పటికే స్వచ్ఛందంగా కల్వకుర్తి, అచ్చంపేట పట్టణాల్లో వ్యాపార సంఘాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఈ నెల 28 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆల్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛంద బ్లడ్ బ్యాంకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నివారణ కోసం ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉంటూ వైరస్ నియంత్రణకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed