సెక్స్ చేసుకోవడానికి 35 రోజుల పండగ.. ఆ పర్వతమే వేదిక

by Anukaran |
Sex Festival
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక్కొక్కరిది ఒక్కో ఆచారం. వారి సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఇష్టదైవాలను కొలుస్తూ పండగలు, ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. వీటిల్లో కొన్ని పండగలు చిత్రవిచిత్రంగానూ ఉంటాయి. ఇలాంటి విచిత్రమైన పండగను ఇండోనేషియాలోని జావా ద్వీపంలోని మౌంట్ కేముకస్ అనే ప్రాంతంలో ప్రతి ఏటా జరుపుకుంటారు. నెల రోజులకు పైగా నిర్వహించే ఈ పండగ ప్రత్యేకత ఏంటంటే.. అపరిచితులతో శృంగారంలో పాల్గొనడం. ఇంత చిత్రమైన పండగ ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా.. ఇక్కడ నేటికీ కొనసాగిస్తుండడం విశేషం.

Sex temples

జావా ద్వీపంలోని మౌంట్ కేముకస్‌లో ఉండే ఓ పర్వతానికి ‘సెక్స్ మౌంటెన్’ అనే పేరుంది. దీనిపై ఉన్న దేవాలయంలో వద్ద అక్కడి ప్రజలు 35 రోజులు పాటు సెక్స్ లో పాల్గొంటారు. వాళ్ల పూజ ఆచారం ప్రకారం పరిచయం లేని వ్యక్తులతో వరుసగా ఏడు సార్లు శృంగారంలో పాల్గొనాల్సి ఉంటుంది. అలా ఒకేవ్యక్తితో జత కడితే వాళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోవచ్చు. లేదా అంతటితో వదిలేసుకోవచ్చు. ఇలా చేస్తే ఆ కుటుంబానికి మంచి జరుగుతుందని వారి పూర్వికుల కాలం నుంచి నమ్ముతూ వస్తున్నారు. అయితే ఈ సెక్స్ పండగలో పెళ్లి అయిన మహిళలు కూడా పాల్గొనవచ్చు. ఆ 35 రోజుల్లో తనకు వచ్చిన వ్యక్తితో ఆమె లైంగికంగా కలవవచ్చు. అయితే ఇలా కలిసిన మహిళలు ఆ తర్వాత భర్తలను వదిలేసి వెళ్తుండడంతో ఈ పండగను రద్దు చేయాలని భర్తల నుంచి ఇప్పుడిప్పుడే డిమాండ్ వస్తుందట.

Sex Mountain

ఇంతకీ ఈ పండగను ఎందుకు చేసుకుంటారో తెలుసా..? జావా ద్వీపం రాజు కుమారుడు అతడి సవతి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న రాజు వారిద్దరిని రాజ్య బహిష్కరణ చేస్తాడు. రాజ భవనం వదిలిన ఆ జంట సమీపంలోని పర్వతం మీద ఉంటారు. అక్కడ వారిద్దరు శృంగారంలో పాల్గొంటుండగా చూసిన రాజభటులు వాళ్లను చంపి అక్కడే పాతిపెడతారు. అది తెలుసుకున్న ప్రజలు వారి ప్రేమకు గుర్తుగా అక్కడ ఆలయం నిర్మించారు. నాటి నుంచి వారికి గుర్తుగా ఏడాదికి ఓసారి 35 రోజులపాటు ఈ సెక్స్ పండగను జరుపుకోవడం వారి ఆనవాయితీగా వస్తుంది. కేవలం కాలి నడకనే వెళ్లే ఈ ఆలయానికి పండగ సమయంలో వేలాది మంది భక్తులు తరలివచ్చి తమ సెక్స్ మొక్కులు తీర్చుకోని వెలుతుంటారు.

Indonesia

Advertisement

Next Story