ఎంపీలో 3000 మంది జూడాల రాజీనామా

by Shamantha N |
ఎంపీలో 3000 మంది జూడాల రాజీనామా
X

భోపాల్: మధ్యప్రదేశ్‌లో సోమవారం నుంచి స్ట్రైక్ చేస్తున్న 3000 మంది జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లను సర్కారు బేఖాతరు చేయడంతో గురువారం ఏకకాలంలో రాజీనామాలు చేశారు. తాము, తమ కుటుంబీకులు కరోనా బారినపడితే ఉచిత ట్రీట్‌మెంట్ ఇవ్వాలని, బెడ్లు రిజర్వ్ చేయాలని, కొవిడ్ డ్యూటీలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలనే డిమాండ్లతో వారు ధర్నా చేశారు. వారి డిమాండ్లలో చాలా వాటిని అంగీకరించినప్పటికీ నిరసన నిలిపేయడం లేదని ప్రభుత్వం మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలియజేసింది. ఈ కష్టకాలంలో సమ్మె చేయవద్దని, 24 గంటల్లో విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించింది. తమ డిమాండ్లు తీరేవరకు సమ్మె విరమించబోమని ప్రకటిస్తూ ఆదేశాల అనంతరమూ జూనియర్ డాక్టర్లు నిరసన కొనసాగించారు.

Advertisement

Next Story