అర్ధరాత్రి.. 2 కిలో మీటర్ల వరకు ముక్కలు ముక్కలుగా శరీరాలు

by Sumithra |   ( Updated:2021-12-20 22:56:40.0  )
Karnataka1
X

దిశ, వెబ్ డెస్క్: 2 కిలో మీటర్ల వరకు కవల పిల్లల శరీరాలు.. తల్లి మృతి చెంది.. తండ్రి ఆస్పత్రిలో ఉన్న విషాదకరమైన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం హాసన్ లో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాసన్ ప్రాంతానికి చెందిన శివానంద్-జ్యోతి దంపతులు. వీరికి ఇద్దరు కవల పిల్లలు. అయితే, ఈ నలుగురు కలిసి బైక్ పై వెళ్తుండగా జాతీయ రహదారిపై లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో శివానంద్, జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. కిందపడిన చిన్నారులపై నుంచి లారీ వెళ్లింది. దీంతో ఆ లారీ చక్రాలకు చిక్కుకుని 2 కి.మీ. వరకు ఆ కవల పిల్లల శరీరాలు ముక్కలు ముక్కలుగా పడ్డాయి. అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించిన లారీ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడికి బ్రీత్ ఎనలైజర్ తో టెస్ట్ చేస్తే మద్యం సేవించినట్లు గర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి మృతిచెందిందని, శివానంద్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీలో దారుణం.. మూడెళ్ల పాపను పార్క్‌లోనే..

Advertisement

Next Story

Most Viewed