మాన్‌సూన్‌..ఇన్ఫెక్షన్స్ అలర్ట్

by Harish |
మాన్‌సూన్‌..ఇన్ఫెక్షన్స్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: పచ్చని కోక కట్టుకున్న ప్రకృతి.. చిటపట చినుకులకు పరవశించే నెమళ్లు..ఆనందంతో రాగాలు తీసే కోయిల..ఆహ్లాదమైన వాతావరణంలో లాంగ్ డ్రైవ్, భూమి నుంచి వచ్చే పరిమళం ఇలా ఎన్నో అందమైన జ్ఞాపకాలుగా నిలిచే.. గురుతులను..వానా కాలం మనకోసం మోసుకోస్తుంది. అయితే ఈ కాలమే సీజనల్ వ్యాధులకు కూడా కారణమవుతుంది. మలేరియా, జాండిస్, ఫ్లూ, డయారేయా వంటి డిసీజెస్‌తో పాటు ‘ఐ ఇన్ఫెక్షన్స్’ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ప్రధానంగా కండ్ల కలక ఈ సీజన్‌లో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. మూడు రకాల ఐ ఇన్ఫెక్షన్స్ బాధ పెడుతుంటాయి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అవి రాకుండా జాగ్రత్త పడొచ్చు.

కండ్ల కలక (కంజక్టివిటీస్):

సాధారణంగా ‘పింక్ ఐ’ అని అంటుంటారు. ఈ కాలంలో ఎక్కువ మందిలో ఈ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది.

కెరాటిటిస్:

‘కార్నియా’కు వచ్చే ఇన్ఫెక్షన్‌ను కెరాటిటిస్ అంటారు. అన్‌హైజీన్ కాంటాక్ట్ లెన్స్ వాడటం వల్ల ఈ తరహా ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. ఈ తరహా ఇన్ఫెక్షన్‌ను నెగ్లెక్ట్ చేస్తే.. ‘బ్లైండ్‌నెస్’ వచ్చే అవకాశం ఉంటుంది.

ట్రాకోమా :

‘బ్యాక్టీరియం క్లామెడియా ట్రాకోమాటిస్’ ద్వారా ట్రాకోమా వస్తుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా 1.9 మిలియన్ల ప్రజలు చూపు కోల్పోయారు. ట్రాకోమా ఇన్ఫెక్టెట్ పర్సన్ ముట్టుకున వస్తువులను తాకడం వల్ల, అతడి వాడిన టవల్స్ వాడటం వల్ల, వారితో డైరెక్ట్‌గా కాంటాక్ట్ కావడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది.

అన్ కుక్డ్ మీల్, అన్‌వాష‌డ్ వెజిటేబుల్స్, మట్టి వల్ల కూడా ఐ ఇన్ఫెక్షన్స్ రావొచ్చు.

టిప్స్ టు ప్రివెంట్ ఇన్‌ఫెక్షన్స్

– చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో కడుక్కోవాలి

– టవల్స్, బట్టలు, బెడ్‌షీట్స్ అన్నీ కూడా సెపరేట్‌గా ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులైన సరే.. వారికి వేరే వాటిని అందివ్వాలి. ఎవరితోనూ బట్టలు పంచుకోకూడదు.

– స్విమ్మింగ్ చేసే సయమంలో.. కాంటాక్ట్ లెన్స్ వాడకూడదు. ఒకవేళ వాడితే.. వెంటనే వేరే పెయిర్ ఉంటే వాటిని వాడుకోవాలి. లేదా కొత్త పెయిర్ కొనుక్కోవాలి.

– లెన్స్ పెట్టుకున్నప్పుడు, తీసేసినప్పుడు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. హైజీన్ లెన్స్ మాత్రమే వాడాలి

– అరణ్య ప్రాంతాల్లో ట్రెక్కింగ్, సైక్లింగ్ చేస్తుంటే కండ్లకు రక్షణగా ఉండే ఐ గేర్ ధరించాలి.

– వర్షంలో తడిస్తే.. వేడినీళ్లతో శుభ్రంగా స్నానం చేయాలి.

– కండ్లు తరుచుగా దురద పెట్టినా.. ఏమైనా డిస్‌కంఫర్ట్‌గా అనిపించినా.. మెడికల్ హెల్ప్ తీసుకోండి. సొంత వైద్యం చేసుకోవద్దు.

– ఇన్ఫెక్టెడ్ పర్సన్ అయితే :

– కళ్లకు గ్లాసెస్ పెట్టుకోవాలి.

– బాయిల్డ్ వాటర్ లేదా ఫిల్టర్ నీళ్లతో కండ్లను వాష్ చేసుకోవాలి

– వైద్యుల సలహాతో లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ వాడాలి

– కండ్లలో ఇర్రిటేషన్‌గా అనిపిస్తే.. రబ్ చేయకూడదు.

Advertisement

Next Story

Most Viewed