చెరువుల్లోకి విషవాయువులు..మత్స్యకారులకు తీరని నష్టం

by Shyam |

దిశ, మహబూబ్ నగర్ :
చెరువులోకి విషవాయువులు విడుదల చేయడంతో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి భారీగా చేపలు మృత్యవాత పడ్డాయి.ఈ ఘటన సోమవారం వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..వనపర్తి జిల్లా రాజనగరం గ్రామపరిధిలోని నల్లచెరువు, అమ్మచెరువులోకి విషవాయువులు చేరడంతో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి.దాదాపు 3 టన్నుల మేర మత్ససంపదకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు నెలలో జిల్లాలోని ఈ చెరువుల్లో 1.5లక్షల చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం వదలగా, అవన్నీ ఇప్పుడు చనిపోవడంతో మత్స్యకారులు జీవనోపాధిని కోల్పొవాల్సి వచ్చింది.దీంతో ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story