2 లక్షల పౌర గుర్తింపు కార్డులు రద్దు

by vinod kumar |
2 లక్షల పౌర గుర్తింపు కార్డులు రద్దు
X

ఇస్లామాబాద్ : ఆప్గనిస్తాన్ శరణార్థులు అక్రమంగా పొందారిని పేర్కొంటూ 2లక్షల కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటీ కార్డ్స్(సీఎన్‌ఐఎస్)ను పాకిస్తాన్ ప్రభుత్వం రద్దు చేసింది. రావల్పిండిలో అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ విలేకరులతో మాట్లాడారు.

15లక్షల మంది ఆప్గనిస్తాన్ శరణార్థులు చట్టపరమైన అనుమతి కలిగి ఉన్నారని తెలిపారు. మరో 8 లక్షల మంది దేశంలో అక్రమంగా ఉంటున్నారని తెలిపారు. వీసాల జారీలో అవినీతి, అక్రమాలను నిరోధించడం కోసం, ఆన్‌లైన్ ద్వారా 192 దేశాలకు వీసాలను జారీ చేస్తున్నామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed