తెలంగాణలో 30వేలకు చేరువలో కరోనా కేసులు

by Anukaran |   ( Updated:2020-07-08 11:24:53.0  )
తెలంగాణలో 30వేలకు చేరువలో కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కరోనా కేసుల సంఖ్య 30వేలకు చేరువైంది. రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 1,924 కేసులు నమోదు కాగా, హైదరాబాద్ పరిధిలోనే 1,590 కేసులు వచ్చాయి. ఇవాళ 11మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 324కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 29,536 మందికి కరోనా సోకగా 11,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చికిత్స తీసుకొని 17,279 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో 99, మేడ్చల్ జిల్లాలో 43, సంగారెడ్డి జిల్లాలో 20 కేసులు, వరంగల్ రూరల్ 26, నిజామాబాద్ 19, మహబూబ్‌నగర్ 15, కరీంనగర్ 14, వనపర్తి 9, సూర్యాపేట జిల్లాలో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story