యూఏఈలో 24 గంటల్లో 283 కేసులు

by vinod kumar |
యూఏఈలో 24 గంటల్లో 283 కేసులు
X

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను అత:పాతాళానికి నెట్టేసింది. గల్ఫ్ దేశాల్లోనూ వీర వీహారం చేస్తోంది. ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. యూఏఈలో మంగళవారం ఒక్కరోజే 283 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,359కి చేరిందని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇప్పటివరకు 19 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 186కి చేరింది. కాగా, మంగ‌ళ‌వారం చ‌నిపోయిన ఓ ఆసియా వాసితో క‌లిపి యూఏఈలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో చ‌నిపోయిన వారి సంఖ్య 12 కు చేరింది. కరోనా విజృంభిస్తున్నందునా ప్ర‌జ‌లు పూర్తిగా ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని అధికారులు ఆదేశించారు. సామాజిక దూరం పాటించ‌డంతో పాటు వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌తో మాత్ర‌మే కరోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరికట్ట‌గ‌ల‌మ‌ని ఈ సంద‌ర్భంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Tags: UAE, corona, 283 positive cases, gulf countries

Advertisement

Next Story