బ్లాక్ దందా.. ఖమ్మంలో భారీగా రెమిడెసివిర్ ఇంజెక్షన్లు పట్టివేత

by Sumithra |
బ్లాక్ దందా.. ఖమ్మంలో భారీగా రెమిడెసివిర్ ఇంజెక్షన్లు పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య తక్కువగా కనిపించినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం గతంతో పోలిస్తే మూడింతలుగా ఉంది. రోజురోజుకూ కరోనా బారిన పడే వారి సంఖ్య పెరుగుతుండగా, మరోవైపు ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరత వలన రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

మరికొందరు కొవిడ్ మహమ్మారిని అడ్డంపెట్టుకుని అక్రమార్జనకు తెరలేపారు. గుట్టుచప్పుడు కాకుండా రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్మకుని కాసులు కొల్లగొడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో భారీగా రెమిడెసివిర్ ఇంజెక్షన్లు పట్టుబడ్డాయి. జిల్లాలోని బాలాజీ ఏషియన్ ఆస్పత్రిలో 2600 రెమిడెసివిర్ వయల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యవసరమైన ఔషధాన్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఫార్మసీ యజమాని కుమారస్వామిని అరెస్టు చేశారు.అదేవిధంగా ఆస్పత్రి యజమాని గిరిధర్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed